26 August, 2026 | 12:14 AM

విద్యార్థులు బాల్యం నుండే ప్రకృతిని ప్రేమించాలి: డిఈఓ విజయ కుమారి

25-08-2026 10:33 PM

రాజాపూర్: విద్యార్థులు విద్యార్థి దశ నుండి ప్రకృతిని ప్రేమించి పర్యావరణాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అలవర్చుకోవాలని జిల్లా విద్యాధికారి విజయ కుమారి అన్నారు. మంగళవారం తిర్మలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వనమహోత్సవం 100 మొక్కలు నాటె కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కనీసం రెండు ముక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని అన్నారు. అలాగే విద్యార్థుల తమ పుట్టినరోజు ప్రత్యేక పర్వదినాలలో మొక్కలు నాటే అలవాటు చేసుకోవాలని సూచించారు.

మొక్కలు ఉంటేనే పర్యావరణం సమతుల్యంగా ఉంటుందని తెలిపారు.మనం మొక్కలను సంరక్షణ, భవిష్య తరాలకు మనం మంచి వాతావరణాన్ని అందించడానికి అంతరం సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో  విజయలక్ష్మి, ఎంఈఓ సుధాకర్, ఎంపీఓ, పుష్ప గ్రామ సర్పంచ్ బంగారి సంతోష వెంకటేష్, ఉప సర్పంచ్ రామచందర్, పంచాయతీ కార్యదర్శి భరత్ కుమార్,గ్రామ పెద్దలు సత్యనారాయణ గౌడ్,నరసింహులు,చంద్రయ్య,శ్రీనివాస్ రెడ్డి,నర్సింలు, అనిల్,శ్రీశైలం,రెహమద్ పాషా,యాదగిరి,నరేష్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.