26 August, 2026 | 12:08 AM

టైక్వాండోలో దివ్యకు గోల్డ్ మెడల్

25-08-2026 10:35 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వర్ష, కిరణ్ దంపతుల కుమార్తె దివ్య టైక్వాండోలో గోల్డ్ మెడల్ సాధించింది. మంగళవారం మాజీ మంత్రి జోగు రామన్న దివ్య నివాసానికి చేరుకున్న ఆమెను శాలువాతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ, చిన్న వయసులోనే టైక్వాండోలో ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయమన్నారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు.

దివ్య సాధించిన విజయం ఆదిలాబాద్ పట్టణానికి, తల్లిదండ్రులకు, కోచ్‌లకు గర్వకారణమని పేర్కొన్నారు. దివ్య ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆదిలాబాద్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల్లో ప్రతిభ చూపుతున్న యువత, విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రామేశ్వర్, నల్ల మహేందర్, సంజయ్, విట్టల్, ప్రకాష్, అంబదాస్,వికాస్, తదితరులు పాల్గొన్నారు.