పచ్చదనంతోనే భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు
ఎంపీడీఓ చిన్న రెడ్డి
చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండలం వడియారం ఫారెస్ట్‌లో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో చేగుంట ఎంపీడీఓ చిన్న రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... అడవులు, పచ్చని వాతావరణం భావితరాల ఆరోగ్యానికి ఎంతో కీలకమని అన్నారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటి సంరక్షణకు కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు.
పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించేందుకు అర్బన్ ఫారెస్ట్‌లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. “మన కోసం మాత్రమే కాదు.. భావితరాల కోసం మొక్కలు నాటి సంరక్షిద్దాం. పర్యావరణాన్ని కాపాడుతూ చేగుంట మరింత పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు అందరం కలిసి పనిచేయాలి” అని అన్నారు.కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, ఎంపీడీఓ చిన్న రెడ్డి, ఎంపీవో ప్రకాష్, సర్పంచ్ సాయికుమార్ గౌడ్,అటవీశాఖ అధికారులు కిరణ్ కుమార్, బీట్ ఆఫీసర్ శ్రీవల్లి, ఏపీఓ శ్వేత , తదితరులు పాల్గొన్నారు.






