26 August, 2026 | 12:18 AM

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

25-08-2026 11:35 PM

- అదనపు కలెక్టర్ హరి సింగ్, మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది

సూర్యాపేట,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణతో పాటు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జిల్లా అదనపు కలెక్టర్ హరి సింగ్, సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. సూర్యాపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వనమహోత్సవ కార్యక్రమాలను జిల్లాలోని ప్రతి పట్టణం, ప్రతి గ్రామంలో విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  మొక్కలు నాటడం మాత్రమే కాకుండా అవి పెరిగే వరకు సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలన్నారు.  పట్టణంలో నీటి ఎద్దడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వర్షపు నీటిని సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుని వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలని సూచించారు.