మాజీ ఎమ్మెల్యేకు ఘన నివాళి
నారాయణఖేడ్, ఆగస్టు 25: నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే దివంగత నేత పి.కిష్టారెడ్డి 11వ వర్ధంతి వేడుకలు నారాయణఖేడ్ లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచగామలో ఆయన సమాధి వద్ద వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ పి.సంజీవరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా నాయకుడు సుధాకర్ రెడ్డి లతోపాటు నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నగేష్ శెట్కార్, పిసిసి సభ్యులు కర్నే శ్రీనివాస్, డిసిసి మాజీ చైర్మన్ జైపాల్ రెడ్డి, విట్టల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, ఆయా సంఘాల ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు సైతం పెద్ద ఎత్తున హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిష్టారెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గానికి అందించిన సేవలను గుర్తుచేసి స్మరించుకున్నారు.






