20 June, 2026 | 6:35 PM

Breaking News

సింగరేణి ఖాళీ క్వార్టర్ల సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలి: ఏఐటీయూసీ   •   కొమరారం మండల ఏర్పాటుకు మంత్రి దామోదర రాజనరసింహకు వినతి   •   యువత హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది   •   రైతులను నమ్మించి నట్టేట ముంచుతారా   •   కేరళ గ్లోబల్ హై స్కూల్‌లో ఘనంగా ముందస్తు యోగా దినోత్సవం   •   అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి   •   సీఆర్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్   •   ఆస్పత్రి సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం   •   కనగర్తిలో ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్తులు   •   ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కొరత సమస్య పరిష్కరించాలి   •  

జిల్లా స్థాయి పోటీలకు వల్లాల ఆదర్శ పాఠశాల విద్యార్థిని ఎంపిక

04-11-2025 07:54 PM

నకిరేకల్ (విజయక్రాంతి): 69వ ఉమ్మడి నలగొండ జిల్లా అండర్-14 హ్యాండ్ బాల్ జట్టుకు మండల పరిధిలోని వల్లాల ఆదర్శ పాఠశాలకు చెందిన ఎస్.కె నస్రిన్ ఎంపికైందని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం కట్టంగూరు మండల పరిధిలోని చెరువు అన్నారం హైస్కూల్లో స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నల్గొండ హ్యాండ్ బాల్ సెలక్షన్ లో అండర్-14 విభాగంలో మంచి ప్రతిభ కనబరిచి ఉమ్మడి నల్గొండ జిల్లా హ్యాండ్ బాల్ జట్టుకు ఎంపికైనదని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా హ్యాండ్ పోటీలకు ఎంపికైన విద్యార్థిని ఎస్.కె నస్రిన్, వ్యాయామ ఉపాధ్యాయుడు బొడ్డు మల్లేష్ ను ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, ఉపాధ్యాయ బృందం తదితరులు అభినందించారు.