2 July, 2026 | 2:32 PM

Breaking News

గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్   •  

ఘనంగా వైకుంఠ చతుర్దశి పూజలు

04-11-2025 10:24 PM

భీమిని (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా భీమినీ మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో వైకుంఠ చతుర్దశి పురస్కరించుకొని మహిళలు దీపాలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సహస్రదీపాలంకరణలో భాగంగా ఆలయంలో దీపాలను వెలిగించి శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆలయ పూజారి సంఘర్ష రాజేశ్వరరావు ఆధ్వర్యంలో గణపతి పూజ అభిషేకం బిల్వ దళాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున  భగవాన్ నామస్మరణలు పాల్గొన్నారు. ఆశ్విజ శుద్ధ పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి వరకు గ్రామంలో నగర సంకీర్తన కార్యక్రమాన్ని గత 40 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వైకుంఠ చతుర్దశి పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంఘర్స్ రవీందర్రావు సంఘర్ సుదర్శన్ రావు, సంతోష్ కుమార్ బండి ప్రభాకర్ గౌడ్, రాజ్ కుమార్ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.