5 March, 2026 | 2:05 PM

ఇరాన్‌పై అమెరికా దమన కాండ వెంటనే ఆపాలి

05-03-2026 12:00 AM

దమ్మపేట, మార్చి 4(విజయ క్రాంతి): ఇరాన్‌పై అమెరికాను తక్షణమే నిలిపివేయాలని సిపిఎం మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. బుధవారం సిపిఎం పార్టీ దమ్మపేట మండల కమిటీ, శాఖా కార్యదర్శుల సంయుక్త సమావేశం పార్టీ మండల కార్యాలయం సుందరయ్య భవనంలో మండల కమిటీ సభ్యులు కొలిక్కి పోగు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. ఇరాన్ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు చేస్తున్న యుద్దం తక్షణం ఆపాలని, అమెరికా అధ్యక్షుడు డోనాల్ ట్రంప్ నియంత్రత్వాన్ని విడనాడాలనీ, ఇరాన్, ఇరాక్, వెనిజులా లాంటి చిన్న దేశాలపై ప్రధానంగా ముడి చమురు నిల్వలున్న దేశాలపై అమెరికా పెత్తనం అధికమైందన్నారు. ఆయా దేశాల్లో ఉన్న ఖనిజ సంపద, సహజ సంపద దోచుకునేందుకు అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ అప్రాజాస్వామికంగా వ్యవహరిస్తున్నారనీ ధ్వజమెత్తారు. ఆటవిక రాజ్యాన్ని తలపించేలా ట్రంప్ హింసాకాండను ప్రజాస్వామిక వాదులందరూ ఖండించాలన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, మోసపూరిత హామీలు ఎన్నో ఇచ్చి హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం గడుపుతుందని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.  ఈ సమావేశంలో మాజీ జిల్లా కమిటీ సభ్యులు దొడ్డ లక్ష్మీనారాయణ,మండల కమిటీ సభ్యులు రావుల శోభన్ బాబు, మొరంపూడి కేశవరావు, ఆబోతు చెన్నకేశవులు, కొప్పుల శ్రీనివాసరావు పాల్గొన్నారు.