12 July, 2026 | 3:09 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చేపట్టాలి

02-05-2026 09:25 PM

అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్

వనపర్తి,(విజయక్రాంతి): ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఎఫ్ ఏ క్యూ ప్రమాణాల ప్రకారమే వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చేపట్టాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ ఆదేశించారు. శనివారం నాడు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మదనాపూర్ మండలంలోని మదనాపూర్, అజ్జకొల్లూ, దుప్పల్లి, రామన్‌పాడు గ్రామాలు మరియు ఆత్మకూరు మండలంలోని పిన్నం చెర్ల గ్రామాల్లో ఉన్న వరి కొనుగోలు కేంద్రాలను (పీపీసీలు) సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో జరుగుతున్న వరి కొనుగోలు ప్రక్రియను సమీక్షించారు. కేంద్రాలలో నిర్వహిస్తున్న రికార్డులు, రిజిస్టర్లు పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు అందుతున్న సౌకర్యాలు, ధాన్యం కొనుగోలు విధానం తదితర అంశాలపై పరిశీలన నిర్వహించారు. అనంతరం పీపీసీ ఇన్‌చార్జీలకు పలు కీలక సూచనలు చేశారు. వరి కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. రికార్డులను సక్రమంగా నిర్వహిస్తూ, ప్రభుత్వం నిర్దేశించిన ఎఫ్ ఎ క్యూ  మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు.