2 May, 2026 | 11:01 PM

పది ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు అభినందనలు

02-05-2026 09:32 PM

కోదాడ,(విజయక్రాంతి): మండల పరిధిలోని నల్లబండగూడెం  జడ్పీ హెచ్ఎస్ ఉన్నత  పాఠశాలలో  పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు శనివారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్పంచ్ అలసకాని  భవాని శరబేశ్వరరావు, రూరల్ ఎస్సై సిహెచ్ గోపాల్ రెడ్డి హాజరై మాట్లాడారు. పాఠశాల నుండి పదవ తరగతి ఫలితాలలో 12 మంది విద్యార్థులు 500 పైగా మార్పులు సాధించడం అభినందనీయమన్నారు.

ఈ సందర్భంగా పాఠశాల నుండి పిన్నం సంతోష్ 572 మార్కులు సాధించి  డివిజన్లో ప్రథమ స్థానంలో నిలవడం  గ్రామానికి గర్వకారణమని కొనియాడారు. అలాగే 565 మార్కులు సాధించిన కల్వకుంట్ల ఉష, 554 మార్కులు సాధించిన మామిడిశెట్టి సర్వజ్ఞ, 543 మార్కులు సాధించిన సామ కీర్తి రెడ్డి లను  ఘనంగా సన్మానించారు.  .ఈ కార్యక్రమంలో సర్పంచ్ అలసకాని భవాని శరభేశ్వరరావు ,రూరల్ ఎస్సై సిహెచ్ గోపాల్ రెడ్డి, హెచ్ఎం ఒక్క వంతుల వసంత ,ఉపసర్పంచ్ ఎరమాల అరుణ శ్రీనివాస్ ,ఎర్రమల బెంజిమెన్ ,ముండ్రా రంగారావు,  సీతారామయ్య , సుధాకర్, శివరామకృష్ణ , ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.