5 March, 2026 | 12:29 PM

ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంట్లో చోరీ

05-03-2026 12:00 AM
  1. ఇద్దరు నిందితులు అరెస్ట్

45 తులాల వెండి, 3.5 గ్రాముల బంగారం, నగదు స్వాధీనం

సికింద్రాబాద్, మార్చ్03 (విజయక్రాంతి): ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 4న నిందితు లను అదుపులోకి తీసుకుని సుమారు 45 తులాల వెండి, 3.5 గ్రాముల బంగారం సహా పలు వస్తువులను స్వాధీనం  చేసుకున్నామని ఏసిపి జి.జగన్ అన్నారు. పోలీసుల వివరాల ప్రకారం, సూరాపురం సాయి హర్ష వర్ధన్ (27), సల్మాన్ ఖాన్ (37)లను అరెస్ట్ చేశారు.

వీరిపై గతంలోనూ పలు దొంగతన కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడు తన కుటుంబంతో సంక్రాంతి సందర్భంగా స్వగ్రామానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు పగులగొట్టి నగలు, నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులు దొంగిలించినట్లు గుర్తించారు. దొంగిలించిన సొత్తులో వెండి పాదసరాలు, వెండి పాత్ర లు, బంగారు ఉంగరాలు, చెవిపోగులు, గొ లుసులు, హెచ్‌పీ ల్యాప్టాప్, రియల్మీ మొబై ల్ ఫోన్, బోట్ స్పీకర్, వివిధ బ్రాండ్ల గడియారాలు మరియు రూ.2.30 లక్షల నగదు ఉన్నట్లు తెలిపారు.

మొత్తం దొంగిలించిన ఆస్తి విలువ సుమారు రూ.5.92 లక్షలు గా అంచనా వేశారు. నిందితులను డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.  కార్యక్రమంలో ఓయూ ఇన్స్పెక్టర్  మహేష్ గౌడ్, డిటెక్టర్కు ఇన్స్పెక్టర్ లెనిన్ బాబు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.