5 March, 2026 | 3:41 PM

పాలేరు గ్రామ వాసికి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు

05-03-2026 12:00 AM

అభినందించిన డిప్యూటీ సీఈవో

కూసుమంచి, మార్చి 4(విజయక్రాంతి): ఇరిగేషన్ శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న కూసుమంచి మండలం పాలేరు గ్రామానికి చెందిన బజ్జూరి రమణారెడ్డికి బెస్ట్ ఎంప్లాయి అవార్డు వరించింది. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రశంసా పత్రాన్ని రమణారెడ్డి కి అందజేశారు.  అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నం దుకు ఈ అవార్డును అందజేసినట్లు రమణారెడ్డికి  తెలిపారు. ఆ పత్రాన్ని టిజీవో రాష్ట్ర అధ్యక్షులు, డిప్యూటీ సీఈఓ ఏలూరు శ్రీనివాసరావు ప్రశంసా  పత్రాన్ని అందించి అభినందించారు.

ఈ సందర్భంగా రమణారెడ్డి ని ఘనంగా సన్మానించి ఉద్యోగి తన కలను సాకారం చేసుకోవడంలో ఎంతో కష్టపడి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా గవర్న మెంట్‌కి ఉత్తములుగా సేవ చేసినందుకు లభించే అరుదైన సత్కారంగా జిల్లా కలెక్టర్ పంపిన ఈ అవార్డును తన చేతుల మీదుగా  రమణారెడ్డికి ప్రధానం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.

అటు అసోసియే షన్‌లో అనేక పదవులు చేయబడుతూ ఇరి గేషన్ శాఖలో జిల్లా అధ్యక్షులుగా కొనసా గడం, తన విధి నిర్వహణ పర్వంలో కలెక్టర్ నుంచి ఈ సత్కారం పొందడం చాలా సంతోషం కలిగించిందని రమణారెడ్డి తెలి పారు.  కూసుమంచి మండలానికి చెందిన వివిధ పార్టీలకు నాయకులు, మండల వివి ధ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యో గులు స్నేహితులు, పాలేరు గ్రామ ప్రజలు రమణా రెడ్డికి అభినందనలు తెలియజేశారు.