10 May, 2026 | 1:44 PM

Breaking News

అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •  

మళ్లీ వేధిస్తున్న యూరియా కొరత

27-02-2026 12:07 AM
  1. నిజామాబాద్ జిల్లా ఏరాజ్‌పల్లిలో విక్రయ కేంద్రం వద్ద రైతుల ధర్నా 
  2. పంపిణీలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం 

నిజామాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాం తి): రాష్ట్రంలో పలు చోట్ల యూరియా కొరత రైతులను వేధిస్తున్నది. యూరియా సకాలం లో అందకపోవడంతో గురువారం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ఏరాజ్‌ప ల్లిలో ఎరువుల విక్రయ కేంద్రం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. సరైన సమయంలో ప్రభుత్వం యూరియా అందించడం లేదం టూ ఎరువుల కేంద్రం వద్ద ధర్నా నిర్వహించా రు.

యూరియా సరిగ్గా సరఫరా చేయడం లేద ని, యూరియాను అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశా రు. యూరియా కొరత లేకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు యూరియా సరఫరా చేయకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యూరియా కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్‌తో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని వేదన వ్యక్తం చేశారు. గతంలో సరఫరా చేసిన విధంగానే పంపిణీ చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు.