27 February, 2026 | 1:47 AM

దేవాదులకు నిధులొచ్చేనా?

27-02-2026 12:08 AM
  1. ఏళ్లుగా కొనసాగుతున్న నిర్మాణ పనులు 
  2. జాప్యం కారణంగా పెరుగుతున్న అంచనాలు
  3. ఇప్పటికే 91 శాతం పనులు పూర్తి
  4. మిగిలిన పనులకు రూ. 4వేల కోట్లు అవసరం
  5. త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పైనే ఆశలన్నీ
  6. ఇటీవల సీఎం సందర్శనతో పెరిగిన ప్రాధాన్యం

హైదరాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాం తి) : తెలంగాణలో గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా ఎత్తున ప్రాంతాలకు అందిం చాలనే లక్ష్యంతో ప్రారంభమైన దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మరోసారి చర్చల్లోకి వచ్చింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేకపోవడం రైతుల్లో ఆవేదన కలిగిస్తోంది. ప్రతి బడ్జెట్ సమయం లో భారీ కేటాయింపుల హామీలు వినిపిస్తున్నా, పనుల పురోగతి మాత్రం ఆశించి నంత వేగంగా లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గోదావరి నీటిని వరంగల్, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి వంటి ఎత్తున జిల్లాలకు ఎత్తిపోతల ద్వారా అందించాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. పలు దశలుగా నిర్మాణం కొన సాగుతుండగా, భూసేకరణ సమస్యలు, సాంకేతిక ఇబ్బందులు, కాంట్రాక్టు మార్పు లు, నిధుల కొరత వంటి కారణాలతో జా ప్యం చోటుచేసుకుంటోంది.

ప్రాజెక్ట్ ప్రారంభమై దాదాపు రెండున్నర దశాబ్దాలు గుడు స్తుంది. అయినా ఈ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. దీంతో నిర్మాణ వ్యయం, విద్యుత్ వినియోగ ఖర్చులు, భూసేకరణ భారం వంటివి ప్రభుత్వంపై ఆర్థిక ఒత్తిడిని పెంచుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం కారణంగా అంచనాలు కూడా అదే స్థాయి లో పెరుగుతున్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

భారీగా పెరిగిన వ్యయం 

రూ.6,016 కోట్లతో ప్రారంభమైన దేవాదుల ప్రాజెక్టు అంచనాలు ఇప్పుడు రూ.18, 500 కోట్లకు చేరాయి. ఆలస్యం కారణంగా నిర్మాణ వ్యయం, భూసేకరణ ఖర్చులు పెరగడం వల్లే ఈ భారీ పెరుగుదల చోటుచేసు కుంది. నిధులు విడుదల కాకపోతే ఖర్చులు మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు పూర్తుతై 6.21 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. ఇప్పటివరకు కేవలం సమీప ప్రాంతాలకే నీరు అందుతోంది. మిగిలిన ప్రాంతాల రైతులు దేవాదుల పూర్తి కోసం ఎన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారు.

దేవాదుల ప్రాజెక్టు పూర్తి కోసం ఈ బడ్జెట్ కీలకం కానుంది. ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన నిధులను ఈ బడ్జెట్‌లో కేటాయిస్తే ప్రాజెక్టు పూర్తి కావడానికి మార్గం సుగమం అవుతుం ది. ఈ నేపథ్యంలో  ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్లో దేవాదులకు తగిన నిధులు కేటాయిస్తారా? లేక మరోసారి పరిమిత కేటాయిం పులతో సరిపెడతారా? అన్నదే ప్రధాన ప్రశ్న గా మారింది. ప్రాజెక్ట్ పూర్తికి అవసరమైన మొత్తాన్ని ఒకేసారి విడుదల చేస్తేనే పనులు వేగం పుంజుకుంటాయని ఇంజినీరింగ్ వర్గా లు సూచిస్తున్నాయి.

ప్రాజెక్టు పూర్తికి ఇంకా రూ. 4,312 కోట్లు

దాదాపు 25 ఏళ్లుగా కొనసాగుతున్న దేవాదుల ఎత్తిపోతల పథకం పూర్తి అవుతుందా లేదా అన్నది మరోసారి బడ్జెట్‌పైనే ఆధారపడింది. ఇప్పటికే 91శాతం పనులు పూర్తయి చివరి దశలో నిలిచిపోయిన ఈ ప్రాజెక్టుకు మిగిలిన పనులు పూర్తి చేయాలంటే తక్షణమే రూ.4,312 కోట్లు అవసరం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో దేవాదులకు తగిన నిధులు కేటాయిస్తారా లేదా అన్నది కీలకంగా మా రింది. ఇరిగేషన్ శాఖ అంచనాల ప్రకారం మిగిలిన పనులు పూర్తి చేయడానికి భారీ మొత్తంలో నిధులు అవసరం. ఇప్పటికే ఈ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు.

దీంతో ఇప్పుడు అందరి దృష్టి బడ్జెట్ పైనే కేంద్రీకృతమైంది. ఈసారి పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తేనే ప్రాజెక్టు పూర్తి దిశగా అడుగులు పడే అవకాశం ఉంది. ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు రూ.14,188 కోట్లు ఖర్చు చేసి 91 శాతం పనులు పూర్తి చేశారు. కేవలం 9శాతం పనులే మిగిలి ఉన్నప్పటికీ, భూసేకరణ సమస్యలు, నిధుల కొరత కారణంగా నాలుగేళ్లుగా పనులు ముందుకు సాగడం లేదు. మూడో దశలో అవసరమైన భూసేకరణ పూర్తికాక పైపులైన్, పంపిణీ వ్యవస్థ పనులు నిలిచిపోయాయి.

సీఎం సందర్శనతో..

సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల దేవాదు ల ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిపై సమీక్షించారు. భూసేకరణకు ని ధులు విడుదల చేస్తామని ప్రకటించడం తో ప్రాజెక్టు పూర్తిపై ఆశలు చిగురించా యి. సమీక్ష సందర్భంగా పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదే శాలు ఇచ్చినట్లు సమాచారం. సీఎం స్థాయిలో సమీక్ష జరగడంతో ఈసారి పనులు వేగం అందుకుంటాయన్న ఆశ రైతుల్లో నెలకొంది.

నీళ్లు వస్తాయన్న ఆశతో ఏళ్లుగా ఎదురుచూస్తున్నప్పటికీ ప్రతి ఎన్నికల సమయంలో కేవలం హా మీలకు మాత్రమే పరిమితమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ప్రాజెక్ట్ పూర్తయితే వేల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు, భూగ ర్భ జలాల పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వర లో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో దేవాదుల ప్రా జెక్టు పూర్తి చేసేందుకు కావాల్సిన ని ధులు చేయడంపై ఆసక్తి నెలకొంది.