సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు
30-08-2026 08:12 PM
రామగిరి, ఆగస్టు30(విజయ క్రాంతి): కరీంనగర్‌లోని మెడికవర్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రామగిరి మండలం సుందిల్ల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం చైర్మన్ కొరకొప్పుల సత్యనారాయణ గౌడ్‌ను మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ మాజీ జెడ్పిటిసి గంట వెంకటరమణారెడ్డి, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ ఉపాధ్యక్షులు ఎల్లే రామ్మూర్తి, సుంద్ధిల్ల సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ తీగల సమ్మయ్య,రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కండె పోషం తదితరులు పాల్గొన్నారు.






