31 August, 2026 | 1:55 AM

సేంద్రియ ఎరువులతో లాభాల పంట

31-08-2026 12:40 AM
  1. రైతన్నలకు మోదీ ప్రభుత్వం తోడ్పాటు 
  2. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

తాండూరు, ఆగస్టు 30 (విజయక్రాంతి): సేంద్రీయ ఎరువులు ఉపయోగించి పంటలు పండిస్తే అధిక దిగుబడులు వచ్చి లాభాలు సైతం అధికంగా వస్తాయని అందుకుగా ను కేంద్ర ప్రభుత్వంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతన్నలకు తోడ్పాటును అందిస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

ఆదివారం వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జింగూర్తి గ్రామ పరిధిలోని ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బాగన్న ఆధ్వర్యంలో సా ందీపని గురుకులంలో పలు భవనాలకు ఆ యన ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిల తో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ స ందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయ న ఎరువులు ఉపయోగించి పంటలు పం డించడంతో భూసారం క్షీణించి భూమిలో ఉన్న సత్తువ కనుమరుగవుతుందని అంతేగాక రసాయనాలు ఉపయోగించిన పంటల తో ప్రజలు అనారోగ్యం పాలు కూడా అవుతారని అన్నారు.

రైతన్నలను ఆదుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రో త్సాహకాలు, ఆర్థిక చేయూత అందిస్తున్నారని అన్నారు. రైతన్నలు కేంద్ర ప్రభుత్వ ప థకాలను సద్వినియోగం చేసుకొని లాభాలు పొందాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు