30 August, 2026 | 9:16 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి

30-08-2026 08:08 PM

బీజేపీ మండల ఉపాధ్యక్షుడు మేకపోతుల వీరప్రసాద్ గౌడ్

గరిడేపల్లి, ఆగస్టు 30,(విజయ క్రాంతి): గరిడేపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్‌లో కనీస వసతులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ మండల ఉపాధ్యక్షుడు మేకపోతుల వీరప్రసాద్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.గరిడేపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బస్టాండ్‌లో మహిళలకు బాత్రూం, ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని, కోదాడ నుంచి వచ్చే బస్సులు బస్టాండ్‌లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

పైకప్పు పెచ్చులు ఊడిపడుతున్న ప్రమాదకర భవనాన్ని వెంటనే మరమ్మతు చేయాలని, పరిసరాల్లో మద్యం సీసాలు తొలగించి పరిశుభ్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు