19 May, 2026 | 2:17 AM

నేడు చాప్టాలో భుంగోండేశ్వర విగ్రహావిష్కరణ

19-05-2026 01:24 AM

కంగ్టి, మే 18: మండల పరిధిలోని చాప్టా(కే) గ్రామంలో కురుమల ఆరాధ్య ధైవం శ్రీ భుంగోండేశ్వర విగ్రహా ఆవిష్కరణను మంగళవారం ఉదయం నిర్వహిస్తున్నట్లు గ్రామ కురుమ సంఘం నిర్వాహకులు తెలిపారు. విగ్రహం ఆవిష్కరణ తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు.

అదే విదంగా సాయంత్రం 5 గంటలకు శ్రీ బసవలింగ అవధూత  మల్లన్నగుట్ట మహారాజ్ వస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక పూజ అనంతరం మహారాజ్ ప్రవచనం ఉంటుందన్నారు. బుధవారం మహాత్మ శ్రీ బీరప్ప కళ్యాణంను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కార్యక్రమంను విజయవంతం చేయాలని కురుమ పెద్దలు కోరారు.