29 July, 2026 | 6:29 PM

గతంలో చేపట్టిన డ్రైనేజీ పూడికతీత పనుల ఫలితం

29-07-2026 05:40 PM

వర్షపు నీరు సాఫీగా ప్రవాహం

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని 13వ వార్డులో గతంలో చేపట్టిన డ్రైనేజీ పూడికతీత, చెత్త తొలగింపు పనుల వల్ల ప్రస్తుతం కురుస్తున్న వర్షాల సమయంలో డ్రైనేజీ కాలువల్లో నీరు ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా ప్రవహిస్తోంది. గతంలో వర్షాకాలంలో పూడిక, చెత్త పేరుకుపోవడంతో నీటి నిల్వలు ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు.

అయితే ముందస్తుగా మున్సిపల్ అధికారులు చేపట్టిన శుభ్రపరిచే పనుల కారణంగా ఈసారి వర్షపు నీరు సకాలంలో వెళ్లిపోతుండటంతో పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వ సమస్యలు తగ్గుముఖం పట్టాయి. డ్రైనేజీ వ్యవస్థను ఎప్పటికప్పుడు స్థానిక వార్డు కౌన్సిలర్ మొహమ్మద్ ఖలేఖ్,మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఖామర్ సుల్తానా గౌస్ పాషా  పర్యవేక్షిస్తూన్నారు. ప్రజలు కూడా డ్రైనేజీల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను వేయకుండా సహకరిస్తే వర్షాకాలంలో నీటి నిల్వలు, మురుగు సమస్యలను నివారించవచ్చని ఆయన విజ్ఞప్తి చేశారు.