29 July, 2026 | 6:02 PM

Breaking News

బాన్సువాడలో త్రాగునీటిపై మున్సిపాలిటీ హెచ్చరిక   •   వందేళ్ల మామిడి చెట్టు.. నెలా మట్టం   •   అర్హులైన ప్రతి ఓటరు పేరు... ఓటరు జాబితాలో నమోదయ్యేలా చూడండి   •   గతంలో చేపట్టిన డ్రైనేజీ పూడికతీత పనుల ఫలితం   •   ప్రసూతి తల్లులకు నాణ్యమైన వైద్య సేవలు, అవసరమైన మందులు అందించాలి   •   ఆషాఢ మాస గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించిన సింగరేణి వైసీఓఏ లేడీస్ క్లబ్   •   మహాదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ   •   ఆర్మూర్ లో వన మహోత్సవం   •   కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆలేటి ఆనందరావు నియామకం   •   భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి   •  

యూత్ డిక్లరేషన్ హామీలు ఏమయ్యాయి?

29-07-2026 05:09 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండల యువజన అధ్యక్షుడు గద్దల రామకృష్ణ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన యూత్ డిక్లరేషన్ హామీలైన ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు స్కూటీలు, యూత్ కమిషన్, వడ్డీ లేని విద్యా రుణాలు, ప్రైవేట్ రంగంలో 75 శాతం ఉద్యోగాలు తదితర హామీలను ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదని ఆరోపించారు. యువతను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు యువత సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.