29 July, 2026 | 6:02 PM

Breaking News

బాన్సువాడలో త్రాగునీటిపై మున్సిపాలిటీ హెచ్చరిక   •   వందేళ్ల మామిడి చెట్టు.. నెలా మట్టం   •   అర్హులైన ప్రతి ఓటరు పేరు... ఓటరు జాబితాలో నమోదయ్యేలా చూడండి   •   గతంలో చేపట్టిన డ్రైనేజీ పూడికతీత పనుల ఫలితం   •   ప్రసూతి తల్లులకు నాణ్యమైన వైద్య సేవలు, అవసరమైన మందులు అందించాలి   •   ఆషాఢ మాస గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించిన సింగరేణి వైసీఓఏ లేడీస్ క్లబ్   •   మహాదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ   •   ఆర్మూర్ లో వన మహోత్సవం   •   కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆలేటి ఆనందరావు నియామకం   •   భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి   •  

విద్యార్థుల‌కు ఇబ్బంల్లేకుండా చూడాలి

29-07-2026 05:12 PM

ఎస్సీ కార్పొరేష‌న్ ఈడీ రామాచారి, డీఎల్ పీఓ అనిత  

మునిప‌ల్లి,(విజ‌య‌క్రాంతి): క‌ళాశాల‌ల్లో చ‌దువుతున్న విద్యార్ధుల‌కు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాల‌ని  ఎస్సీ కార్పొరేష‌న్  ఈడీ, మండ‌ల స్పెష‌లాఫీస‌ర్ రామాచారి, డీఎల్ పీఓ అనితలు సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. ఇందులో భాగంగానే మండ‌లంలోని  బుదేరా చౌర‌స్తాలోగ‌ల గురుకుల మ‌హిళా డిగ్రీ క‌ళాశాలను బుధ‌వారం  ఎంపీడీఓ శ్రీ‌నివాస్ రెడ్డితో క‌లిసి వారు సంద‌ర్శించి క‌ళాశాల ప‌రిస‌ర ప్రాంతాల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ ప్ర‌స్తుతం వ‌ర్షాలు  ప‌డుతున్నందన  ప‌రిస‌రాలు  ప‌రిశుభ్రంగా ఉండేలా చూడాల‌ని ప్రిన్సిపాల్ పుణ్య శైల‌జకు సూచించారు.

ముఖ్యంగా వంట శాల‌లో ఎప్ప‌టిక‌ప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచాల‌న్నారు. అలాగే విద్యార్ధుల‌కు ప్ర‌భుత్వం అందిస్తున్న  భోజ‌నం మెనూ ప్ర‌కారం అందించాల‌న్నారు. అంతకు ముందు   విద్యార్ధుల‌తో    విద్యార్థుల‌తో క‌లిసి స‌హపంక్తి భోజ‌నం చేసి రుచి చూసి అద్యాప‌క బృందాన్ని అభినందించారు.  అనంత‌రం భోజ‌న శాల నిర్వ‌హ‌ణ, ఆహార నాణ్య‌త, ప‌రిశుభ్ర‌త త‌దిత‌ర వాటిపై ప్రిన్సిపాల్ పుణ్య  శైలజ‌ను అడిగి తెలుసుకున్నారు.  వారి వెంట ఎంపీఓ కృష్ణ కుమార్,  పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి న‌ర్సింలు, వైస్ ప్రిన్సిపాల్ జ్యోతి , అద్యాప‌క బృందం త‌దిత‌రులు ఉన్నారు.