మహా ధర్నా పోస్టర్ ఆవిష్కరణ
ముకరంపుర,(విజయక్రాంతి): విద్యా రంగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య మొండి వైఖరికి నిరసనగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్)రాష్ట్ర శాఖ ఉద్యమ కార్యచరణలో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ, పిజి కళాశాలలో తపస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అన్నమనేని తిరుపతిరావు, జారతి నర్సయ్యల ఆధ్వర్యంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు ఆగస్టు 1వ తేదీన చలో హైదరాబాద్ మహా ధర్నా కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించింది.
కరీంనగర్ జిల్లా నుండి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ప్రభుత్వం తమ మేనిఫెస్టో లో పేర్కొన్న ఉపాధ్యాయల అపరిష్కృత సమస్యలైన పిఆర్సి 51 శాతం, 6 పెండింగ్ డిఏలు, సిపిఎస్ రద్దు ఓపీఎస్ అమలు, అన్ని రకాల పెండింగ్ బిల్లుల విడుదల, ఇతర అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అన్నమనేని తిరుపతిరావు, జారతి నర్సయ్య లతో పాటు జిల్లా, మండల బాధ్యులు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






