21 July, 2026 | 10:10 PM

Breaking News

అక్రమ ఇసుక నిల్వలు సీజ్

21-07-2026 08:03 PM

* అక్రమ ఇసుక రవాణాను ఉపేక్షించేది లేదు

* పాపన్నపేట తహసిల్దార్ సతీష్ కుమార్

పాపన్నపేట: అక్రమ ఇసుక రవాణాను ఉపేక్షించేది లేదని, ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే సమాచారం ఇవ్వాలని పాపన్నపేట తహసిల్దార్ సతీష్ కుమార్ సూచించారు. మండలంలోని కుర్తివాడలో మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుక తరలించి నిలువ చేసిన కుప్పలను మంగళవారం పోలీసు, రెవెన్యూ సిబ్బందితో కలిసి సీజ్ చేశారు. 29 స్థలాలలో సుమారు 154 ట్రాక్టర్ల విలువచేసే ఇసుక నిల్వలను సీజ్ చేసినట్లు తెలిపారు. మండలంలో మంజీరా నది, చెరువుల నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్ ఐ శరత్ కుమార్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఉన్నారు.