సర్ ప్రక్రియను పరిశీలించిన టీఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ ఇంచార్జి భూక్యా సంజీవ్ నాయక్
21-07-2026 08:09 PM
కోదాడ: టీఆర్ఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు కోదాడ పట్టణంలోని కోదాడలో సర్ ప్రక్రియను కోదాడ నియోజకవర్గ తెలంగాణ రాష్ట్ర రక్షణ సేన కోదాడ నియోజకవర్గ ఇంచార్జి భూక్యా సంజీవ్ నాయక్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు సర్ ప్రక్రియను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అధికారులు తప్పులు లేకుండా చూడాలన్నారు. ఓటర్లకు అన్యాయం చేయవద్దన్నారు.






