21 July, 2026 | 10:10 PM

Breaking News

పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత

21-07-2026 07:56 PM

* జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలం సాతారం జడ్పీ హైస్కూల్‌ను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మంగళవారం పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా అదనపు తరగతి గదుల నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలకు మొత్తం 39 తరగతి గదులు అవసరం కాగా ప్రస్తుతం 16 మాత్రమే ఉన్నాయని, మరో 23 గదుల నిర్మాణానికి సుమారు రూ.12 కోట్ల వ్యయం అవసరమని అధికారులు కలెక్టర్‌కు వివరించారు.