21 July, 2026 | 10:11 PM

Breaking News

బిజెపి పోరాటం వల్లే హౌసింగ్ బోర్డు రోడ్డుకు నిధులు

21-07-2026 07:59 PM

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): బిజెపి పోరాటం వల్లే హౌసింగ్ బోర్డు రోడ్డుకు నిధులు మంజూరయ్యాయని ఆ పార్టీ నాయకులు బొజ్జ రాఘవరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మేడ్చల్ హౌసింగ్ బోర్డు కాలనీ నుండి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయం వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని గిర్మాపూర్ మున్సిపల్ పట్టణ బిజెపి నాయకులు అనేక సార్లు సంబధిత అధికారులకు వినతి పత్రాలను సమర్పించడం జరిగిందని ఆయన తెలిపారు. అదేవిధంగా రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఒకవైపు ధర్నాలు, నిరసనల కార్యక్రమాలు నిర్వహించి ప్రజల తరుపున పోరాటాలు కొనసాగించడం జరిగిందని ఉన్నారు.

హౌసింగ్ బోర్డు కాలనీ నుండి గ్రంధాలయం వరకు శిథిలావస్థలో ఉన్నటువంటి రోడ్డు సమస్యను పరిష్కరించేందుకు మల్కాజిగిరి బిజెపి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పలుమార్లు  అధికారులతో మాట్లాడినట్లు ఆయన తెలియజేశారు. రోడ్డు సమస్యపై ఏప్రిల్ 13 వ తేదీన నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు.కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు రోడ్డు నిర్మాణానికి మేమే నిధులు మంజూరు చేయించామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ డివిజన్ బిజెపి కార్యదర్శి బండి విష్ణు గౌడ్.శ్రీపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.