13 March, 2026 | 5:38 AM

మంత్రి జూపల్లి ఇలాఖాలో ఆగని ఇసుక దందా

13-03-2026 12:38 AM

కొల్లాపూర్, మార్చి 12: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అ క్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మంత్రి జూపల్లి ఇలాఖాగా గుర్తింపు ఉన్న ఈ ప్రాం తంలోనే ఇసుక దందా ఆగకుండా సాగుతుండడం చర్చనీయాంశంగా మారింది.ము న్సిపాలిటీ 13వ వార్డు పరిధిలోని చౌటబెట్ల వాగు, యన్మన్బెట్ల వాగుల నుంచి ప్రతిరోజూ ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుక తర లిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. వాగు లో హిటాచీ యంత్రంతో ఇసుకను ఒకేచోట డంప్ చేసి, అక్కడి నుంచి ట్రాక్టర్లలో రాత్రింబగళ్లు తరలిస్తున్నారని తెలిపారు.

ఒక్కో ట్రాక్టర్కు సుమారు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు తీసుకుంటూ కొందరు వ్యక్తులు అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులకు కూడా ముడుపులు అందుతున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై కొల్లాపూర్ మండల తహసిల్దార్ భరత్ కు మార్ను వివరణ కోరగా, మండలంలో ఇసు క తరలింపుకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని తెలిపారు. చౌటబెట్ల, యన్మన్బెట్ల వాగుల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చినందున వెంటనే గిర్దావర్ను పంపించి విచారణ జరిపిస్తామని చెప్పారు. అక్రమంగా ఇసుక తరలించే ట్రాక్టర్లను సీజ్ చేస్తామన్నారు.

జీపీఎస్ కలిగిన మైనింగ్ శాఖలో నమోదు చేసిన వాహనాల ద్వారానే ఇసుక రవాణా జరగాలని సూచించారు. ప్రస్తుతం కొల్లాపూర్, పెంట్లవెల్లి ప్రాంతాల్లో ఇసుక రీచ్లకు ఎలాంటి అధికారిక అనుమతులు లేవని కొల్లాపూర్ తహసిల్దార్ భరత్ కుమార్, పెంట్లవెల్లి తహసిల్దార్ రాజ్కుమార్ తెలిపారు.