19 March, 2026 | 6:52 AM

అన్‌పార్లమెంటరీ భాష వాడలేదు

19-03-2026 02:19 AM
  1. సీఎం చెప్పిందే ప్రస్తావించా పార్టీ ఫిరాయింపులపై సభలో చర్చకు వీలుంది
  2. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): తెలంగాణ శాసనసభ లో తాను ఎక్కడా అన్‌పార్లమెంటరీ భాష ఉపయోగించలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలనే తాను ప్రస్తావిం చానని, అవి రికార్డులో ఉంటే తాను చెప్పినవి కూడా రికార్డులో ఉండాలని ఆయన పేర్కొన్నారు. సభలో మంగళవారం తాను మాట్లాడిన విషయాలపై వచ్చిన అభ్యంతరాలపై బుధవారం స్పందిస్తూ కేటీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

స్పీకర్ సార్, ‘నేను నిన్న(మంగళారం) మాట్లాడిన దాంట్లో అన్‌పార్లమెంటరీ గా ఏం మాట్లాడానో ఎవరూ కోట్ చేయలేదు. నేను అన్‌పార్లమెంటరీగా మాట్లాడానని నేను అనుకో వట్లేదు’. అలాంటి మాటలు మాట్లాడి ఉంటే మీరు అప్పుడే ఆపేవారు. మీరు అన్నీ వింటున్నారు. కాబట్టి రికార్డుల నుంచి తొలగించాల్సిన అవసరం లేదు’ అని తెలిపారు. తాను ఎక్కడా అనుచిత పదజాలం ఉపయోగించలేదని స్పష్టం చేస్తూ, ఏమన్నా అనకూడని మాటలు అన్నానా?, ముఖ్యమంత్రి లాగా భడివే అన్నానా? బలి దేవత అన్నానా? అలాంటి పదాలు ఉపయోగించలేదని స్పష్టం చేశారు.

సీఎం గతంలో మాట్లాడిన మాటలనే నేను గుర్తు చేశాను అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సరైనవైతే అవి రికార్డులో ఉంటే, అదే సందర్భంలో తాను చెప్పిన మాటలు కూడా రికార్డులో ఉండాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. సభలో చర్చలు రాజ్యాంగ పరిమితుల్లోనే జరుగుతాయని, ఇది శాసనస భగా చట్టాలు చేసే వేదిక అని గుర్తు చేశారు.

శాసనసభ రాజ్యాంగ పరిధిలో పనిచేసే సంస్థ అని, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులపై కూడా ఈ సభ లో చర్చలు జరిగిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ఇటీవల బీసీ రిజర్వేష న్ల విష యంలో కూడా కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ సభలో చర్చించామని ఆయన వివరించారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి, అలాగే జాతీయ ప్రతిపక్ష నాయకుడు రాహు ల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను మాత్రమే తాను ప్రస్తావించానని కేటీఆర్ స్పష్టం చేశారు.

న్యాయ పత్రంలో పేర్కొన్న ట్లుగా ఎవరైనా ఒక పార్టీ నుంచి గెలిచి, మరో పార్టీలో చేరితే ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పిన విషయాన్ని మాత్రమే నేను ప్రస్తావిం చాను అని తెలిపారు. అనర్హత పిటిషన్ల విషయంలో స్పీకర్ ఇప్పటికే నిర్ణయం తీసుకు న్నప్పటికీ, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని తాను కోరుతున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ మారిన వారిపై క్లియర్ చిట్ ఇవ్వడం సరైంది కాదని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.