13 July, 2026 | 4:09 PM

ఘనంగా అజ్మాతుల్లా హుస్సేని జన్మదిన వేడుకలు

13-07-2026 03:06 PM

గంభీరావుపేట, జులై 13 (విజయక్రాంతి):రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మాతుల్లా హుస్సేని జన్మదిన వేడుకలను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిమ్మల తిరుపతి గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధాశ్రమం,ప్రభుత్వ ఆసుపత్రిలో వృద్ధులకు, రోగులకు పండ్లు, బ్రెడ్‌లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి గౌడ్ మాట్లాడుతూ, హుస్సేని ప్రజాసేవలో ముందుండే నాయకుడని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు సయ్యద్ సాహెబ్, మోహిజ్, పర్శరాములు నాంపల్లి, శంకర్ రాజగౌడ్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.