19 March, 2026 | 6:50 AM

భారీగా కల్తీ పన్నీర్ పట్టివేత

19-03-2026 02:17 AM

ఆరుగురు నిందితుల అరెస్ట్

సికింద్రాబాద్, మార్చ్18 (విజయక్రాంతి): ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటూ అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ పనీర్ పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ (ఖైరతాబాద్ జోన్) బృందం రట్టు చేసింది. నమ్మదగిన సమాచారం మేరకు, ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బి. సాహితితో కలిసి సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజ్ బజా ర్ ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ దాడు ల్లో ఆరు హోల్సేల్, రిటైల్ దుకాణాలపై దాడులు చేసి, నిబంధనలకు విరుద్ధంగా కల్తీ ఉత్పత్తులను విక్రయిస్తున్న జైపాల్ సింగ్ రాజ్పురోహిత్, కొలారియా వైభవ్, నరేష్ కొలారియా, ప్రేమ్ అనిల్ వ్యాస్, రామ్ కిషోర్ కొలారియా, లక్ష్మీనారాయణ కొలారియా అనే ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితులు గుర్తు తెలియని ప్రాంతాల నుండి కల్తీఅపరిశుభ్రమైన పనీర్, ఇతర పాల ఉత్పత్తులను భారీ మొత్తంలో సేకరించి, వాటిని నాణ్యమైన ఉత్పత్తులుగా నమ్మిస్తూ కిలో రూ. 280/- చొప్పున హోటళ్లు, క్యాటరింగ్ సర్వీసులు, సామాన్య ప్రజలకు విక్రయిస్తున్నారు. తనిఖీ సమయంలో ఈ ఉత్పత్తులను ప్లాస్టిక్ కవర్లలో ఉంచి, దుమ్ము, ఈగలు వాలే అపరిశుభ్ర వాతావ రణంలో నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఉత్పత్తులపై ఎటువంటి బ్రాండ్ పేరు, తయారీ) లేదా గడువు తేదీ లేకపో వడమే కాకుండా, కనీస పేస్ట్ కంట్రోల్ రికార్డులు కూడా లేవని తేలింది. ఇవి మానవ వినియోగానికి అత్యంత ప్రమాదకరమని అధికారులు వెల్లడించారు.

స్వాధీనం చేసుకున్న నిల్వల వివరాలు

ఈ దాడుల్లో పోలీసులు మొత్తం 3,892 కేజీల కల్తీ పాల ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు, వీటి విలువ సుమారు రూ. 11,11,600/- ఉంటుంది. స్వాధీనం చేసుకున్న సొత్తులో 2,572 కేజీల పనీర్, 927 కేజీల కోవా, 249 కేజీల వైట్ క్రీమ్, 132 కేజీల అజ్మీరా కలకండ్ మరియు 12 కేజీల నెయ్యి ఉన్నాయి. ఈ అక్రమ వ్యాపా రంలో ప్రధానంగా శంకర్లాల్ మిల్క్ ప్రొడకట్స్, విజయ మిల్క్ షాప్, వైభవ్ మిల్క్ డెయిరీ, శ్రీ బాలాజీ డెయిరీ ప్రొడకట్స్, జగదాంబ మిల్క్ మర్చెంట్ మరియు తులసి గిరిరాజ్ డెయిరీ ప్రొడకట్స్ అనే సంస్థలు పాల్గొన్నట్లు గుర్తించారు.