ఇబ్రహీంపట్నం ఏసీపీ, ఇన్స్‌పెక్టర్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశంస
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 16 (విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలకు రాష్ట్ర ప్రభు త్వం సేవా పతకాలతో సత్కరించిన ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.
ఇబ్రహీంపట్నంలో సహస్ర సీమా బల్ (ఎస్ ఎస్ బీ ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ ఎస్ జి) సిబ్బంది కోసం నిర్మించిన నూతన ఫ్యామిలీ క్వార్టర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డిలను కలుసుకున్న మంత్రి.స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వారి సేవలను గుర్తించి సేవా పతకాలతో సత్కరించిన విషయం తెలుసుకుని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు మరింత చేరు వగా ఉంటూ సేవా దృక్పథంతో విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తూ పో లీసు వ్యవస్థపై మరింత విశ్వాసం పెంపొందించేలా పనిచేయాలని అన్నారు. విధి ని ర్వహణలో అంకితభావంతో సేవలందిస్తూ పోలీసు శాఖకు మరింత మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు.






