7 August, 2026 | 10:07 PM

భూ రికార్డుల రీ-సర్వేపై అవగాహన

07-08-2026 08:56 PM

బెజ్జంకి,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వీరాపూర్ గ్రామంలో శుక్రవారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూ రికార్డుల రీ-సర్వే, భూ రికార్డుల సమీకరణపై అవగాహన సదస్సు నిర్వహించారు. అసిస్టెంట్ డైరెక్టర్ (సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్), డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ (సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్), తహసీల్దార్ శ్రీకాంత్, సర్పంచ్ చిలుముల సతీష్ పాల్గొని భూ రికార్డుల సమీకరణ, రీ-సర్వే విధానం, రైతులు పాటించాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. ప్రజల భూ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది, గ్రామపంచాయతీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.