4 March, 2026 | 8:59 PM

భద్రాచలంలో త్వరలో గిరి మాల్టు ప్రారంభం

04-03-2026 06:50 PM

ఐటీడీఏ ఏపీవో డేవిడ్ రాజ్

భద్రాచలం,(విజయక్రాంతి): ఐటీడీఏ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభించబోయే గిరి మాల్ట్ లో వివిధ పోస్టులలో పనిచేయడానికి ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఆదేశాల మేరకు వ్యాపార లావాదేవీలలో అవగాహన, అనుభవం గల వర్కర్లను ఎంపిక చేయడానికి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగిందని సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. బుధవారం నాడు ఐటిడిఏ ప్రాంగణంలోని వైటీసీలో త్వరలో ప్రారంభించబోయే గిరి మాల్ట్ లో ఇంటర్మీడియట్, ఆపైన విద్యార్హత గల మహిళలకు సేల్స్ అసోసియేట్, క్యాషియర్, స్టాక్ అసిస్టెంట్ పోస్టుల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించగా

భద్రాచలం లోని స్థానికంగా ఉన్న 15 మంది యువతి యువకులు హాజరయ్యారని అన్నారు. వారిని ఒక్కొక్కరిని పిలిచి వారి యొక్క అనుభవము మరియు అవగాహన ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. ఆసక్తిగల యువతీ యువకులు ఈ పోస్టులలో పనిచేయడానికి ఇంకా ఎవరైనా ఉంటే ఐటీడీఏ కార్యాలయంలోని భవిత సెల్ నందు సంప్రదించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పివిటిజి అధికారి గన్యా, జేడీఎం హరికృష్ణ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.