అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ పనులు షురూ..
ప్రారంభించిన మధిర మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాత
ఎర్రుపాలెం, మార్చి 6 (విజయక్రాంతి): మధిర పట్టణంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటు పనులను శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాత ప్రారంభించారు. పట్టణంలోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయం ప్రాంతంలో లాంఛనంగా ఎన్పీడీసీఎల్ డి ఈ బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పనులకు మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ సుజాత మాట్లాడుతూ మధిర పట్టణం ను మోడల్ నియోజకవర్గ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో వివిధ అభివృద్ధి పనులకు గాను కోట్లాది రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటు ద్వారా పట్టణం మెట్రో సిటీలతో సమానంగా అభివృద్ధి పథంలో అడుగులు వేయనున్నదని తెలిపారు. ప్రస్తుతం ప్రారంభం కానున్న ఈ పనులు త్వరితగతి న నాణ్యత ప్రమాణాలతో పూర్తయ్యే విధంగా అధికారులు నిర్వహించాలని ఆమె కోరారు.
అనంతరం డి ఈ బండి శ్రీనివాస్ మాట్లాడుతూ రూ.28.14 కోట్లతో చేపడుతున్న ఈ పనులు పట్టణములో ప్రమాదాలు లేని విద్యుత్ సరఫరా కు మార్గం సుగమం కానున్నదని అన్నారు. కేబుల్ లైన్ నిర్మాణాలు పూర్తయితే అవంతరాలు లేని విద్యుత్ అందించడం జరుగుతుందని అన్నారు. పనులను చేపడుతున్న క్రమంలో విద్యుత్ శాఖతోపాటు మున్సిపల్ శాఖ,టెలికాం, తాగునీటి సరఫరా, ఆర్ అండ్ బి శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని కేబుల్ నిర్మాణ పనులను పూర్తి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కోన రవికుమార్ కౌన్సిలర్లు బోడెపుడి రేవతి, నాగార్జున తో పాటు కాంగ్రెస్ పార్టీ మండల పట్టణ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ మిర్యాల రమణ గుప్తా నాయకులు రంగా హనుమంతరావు పాటిబండ్ల సత్యంబాబు కర్నాటి రామారావు మాగం ప్రసాద్ రంగా శ్రీనివాస్ దోర్నాల సునీల్ ఎర్రమదాసు ప్రభాకర్ తలుపులు వెంకటేశ్వర్లు డేవిడ్ బోడిపుడి గోపి సామినేని రామనాథం బుల్లెద్దు రాజేంద్ర అద్దంకి రవికుమార్ సాలిక సురేష్ తదితరులు ఉన్నారు.




