7 March, 2026 | 10:53 AM

9న ఐటీఐ విద్యార్థులకు అప్రెంటిస్ షిప్ మేళా

07-03-2026 01:39 AM

బూర్గంపాడు, మార్చి 6 (విజయక్రాంతి): ఈనెల 9న ప్రభుత్వ ఆర్.ఐ. టి.ఐ కృష్ణ సాగర్ లో అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహించనున్నట్లు స్థానిక ఐటీఐ ప్రిన్సిపాల్ ధర్మచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అప్రెంటిషిప్ మేళకు టి.కే.ఐ ఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చర్లపల్లి, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నాచారం కంపెనీ ప్రతినిధులు హాజరు కానున్నారని, మేళాలో ఐటీఐ పాస్ అయిన విద్యార్థులకు అప్రెంటిస్ షిప్ ఇప్పించబడుతుందన్నారు. విద్యార్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసి ఫారం, ఒరిజినల్, జిరాక్స్ ధ్రువీకరణ పత్రాలతో ప్రభుత్వ ఐటీఐలో సోమవారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం వరకు హాజరుకావాలన్నారు.