23 July, 2026 | 1:24 AM

అండర్ డ్రైనేజీ పనులు ప్రారంభం

23-07-2026 12:49 AM

మేడ్చల్ అర్బన్, జూలై 22(విజయక్రాంతి): ఎల్లంపేట్ మున్సిపాలిటీలోని 24 వ వార్డులో అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ కృష్ణా రెడ్డితో కలిసి కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్ ముదిరాజ్ కొబ్బరికాయ కొట్టి  ప్రారంభించారు.  అండర్ డ్రైనేజీ పనులు పూర్తయిన తర్వాత వార్డు ప్రజలకు మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించి పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడనున్నట్లు కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్ ముదిరాజ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీదేవి, వైఎస్ చైర్ పర్సన్ రజిత రెడ్డి, శ్రీలతతో పాటు ప్రజా ప్రతినిధులు పంచాయతీ కార్యదర్శి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.