5 July, 2026 | 2:12 AM

ఆర్యన్ రాజేశ్ నిర్మాణ సారథ్యంలో..

05-07-2026 12:24 AM

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరున్న ఈవీవీ సినిమా ఇప్పుడు ఓ వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. లెజెండరీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ స్థాపించిన ఈ బ్యానర్‌లో ఎన్నో వినోదాత్మక చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు ఈ లెజండరీ బ్యానర్‌పై ఈవీవీ తనయుడు ఆర్యన్ రాజేశ్, మరో నిర్మాత ఎన్‌వీ కృష్ణారెడ్డితో కలిసి ఈ తాజా సినిమాను నిర్మించనున్నారు.

ఈవీవీ సినిమా, ఎన్వీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఓ బలమైన ప్రేమకథగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో హర్ష్ రోషన్ హీరోగా, ప్రియాంక ఆచర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అరుణ్ బాలాజీ, శ్రీ రంజని సంయుక్తంగా దర్శకత్వం వహిస్తారు. ఇటీవల పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. జిజు సన్నీ డీవోపీగా పనిచేస్తున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు నిర్మాతలు త్వరలో తెలియజేయనున్నారు.