5 July, 2026 | 2:10 AM

టాలీవుడ్‌కు కొత్తందం!

05-07-2026 12:23 AM

తెలుగు తెరపై మరో కొత్తందం అలరించనుంది. మన్విక క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత డీ మోహన్ ఓ సినిమాను రూపొందించనున్నారు. దర్శకుడు కొమరం సూర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎల్ చరణ్ హీరో. మేఘాంషు వర్మ ఈ సినిమాతో కథానాయికగా బిగ్‌స్క్రీన్‌కు పరిచయం అవుతోంది. బెజవాడ కృష్ణ క్యాస్టింగ్ టీమ్‌కు చెందిన మేఘాంషు వర్మతోపాటు లాస్య, ప్రశాంతి, జోత్స్న ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.

‘భరత్ అనే నేను’ ఫేమ్ శుభోదయం సుబ్బారావు అలియాస్ రాజశేఖర్, చరణ్ తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఒక రీసెర్చ్ కోసం వెళ్లేందుకు ఒక క్యాబ్‌ను బుక్ చేసుకున్న నలుగురు అమ్మాయిలకు ఆ క్యాబ్‌లో ఓ సంఘటనను ఎదుర్కోవడం..

ఆ సంఘటన ఇంతకుముందే వాళ్లు ఎదుర్కోని ఉండటం వంటి అంశాలతో రూపొందనున్న హార్రర్ మూవీ ఇది. మొత్తంగా ఆ సమస్య నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారనేది సినిమా ప్రధాన కాన్సెప్ట్ అని చిత్రబృందం పేర్కొంది. ఆదివారం నిర్వహించనున్న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందీ చిత్రం.