సూపర్ వుమెన్!
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ మూవీ ‘కిల్లర్’. మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. పూర్వాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ పద్మనాభ రెడ్డి ఏతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో రిలీజ్‌కు రానుంది. శనివారం హీరోయిన్ జ్యోతి పూర్వజ్ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ పోస్టర్‌లో సూపర్, మిస్టీరియస్ వుమెన్‌గా జ్యోతి పూర్వజ్ లుక్స్.. ‘మెలిఫిసెంట్’ చిత్రంలో ఏంజెలీనా జోలిని తలపించేలా ఉండ టం విశేషం. ఈ సినిమాలో సూపర్ షీ క్యారెక్టర్‌లో జ్యోతి పూర్వజ్ నటన ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయ నుంది. పూర్వాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతోపాటు సీఎన్‌ఏ ఇంటి గ్రేషన్, రాయ్ ప్రోటోకాల్ కోసం వర్క్ చేసే సైంటిస్ట్‌గా కనిపించ బోతున్నారు. ఈ చిత్రానికి డీవోపీ: జగదీశ్ బొమ్మిశెట్టి; సంగీతం: ఆశీర్వాద్, సుమన్ జీవ; యాక్షన్: రాజ్‌కుమార్ గంగపుత్ర; ఆర్ట్: మణి.






