కోడలికి మళ్లీ పెళ్లి చేసిన మామ
11-07-2026 12:00 AM
భోపాల్, జూలై 9: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో ఓ మామ తన కోడలికి పెళ్లి చేసి ఉదారత చాటుకున్నాడు. జైథల్ గ్రామానికి చెందిన దినేశ్ వైరాగి కుమారుడు కపిల్‌కు ప్రియాంకతో 2018లో వివాహమైంది. ఆమె వయస్సు అప్పటికీ 19 ఏళ్లు. కుమారుడు క్యాన్సర్ కారణంగా 2023లో మృతి చెందాడు. చిన్నవయసులో ఉన్న కోడలిని చూసి మామ దినేశ్ తీవ్రంగా కలత చెందాడు. సొంతకుతూరిలా భావించి ఆమెకు మళ్లీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. మంచి సంబంధం చూసి తానే పెళ్లి ఖర్చు భరించి ఘనంగా పెళ్లి చేశాడు.






