29 August, 2026 | 7:30 PM

చికిత్స కోసం రూ.1.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

29-08-2026 06:52 PM

అనారోగ్యంతో బాధపడుతున్న పెయ్యాల రాధమ్మకు మంత్రి శ్రీధర్‌బాబు భరోసా

మంథని,(విజయక్రాంతి): అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ముత్తారం మండలం ముత్తారం గ్రామానికి చెందిన పెయ్యాల రాధమ్మకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అండగా నిలిచారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆమె వైద్య చికిత్స కోసం రూ.1.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించారు. పెయ్యాల రాధమ్మ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.1,50,000 విలువైన ఎల్‌ఓసీ మంజూరు చేయించి సహాయం అందించారు. మంత్రి శ్రీధర్‌బాబు చొరవతో మంజూరైన ఎల్‌ఓసీని హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన ఆసుపత్రి సహాయకులు రాధమ్మ కుటుంబ సభ్యులకు అందజేశారు. క్లిష్ట సమయంలో వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు పెయ్యాల రాధమ్మ కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.