29న మానుకోటకు కేటీఆర్ రాక
మహబూబాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం, ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పై పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 29న మహబూబాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు.
జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎంపీ, జిల్లా పార్టీ అధ్యక్షురాలు మా లోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే డి ఎస్ రెడ్యా నాయక్ తదితరులు మాట్లాడుతూ కేటీఆర్ పాల్గొనే సభను విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు.
అనంతరం సభ నిర్వహించనున్న పియస్‌ఆర్ గార్డెన్ లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సమావేశంలో జడ్పీ మాజీ చైర్మన్ కుమారి అంగోత్ బిందు, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, బిరవెల్లి భరత్ కుమార్ రెడ్డి, మార్నేని వెంకన్న, పర్కాల శ్రీనివాస్ రెడ్డి, యాళ్ల మురళీధర్ రెడ్డి, మార్నేని రఘు, మహబూబ్ పాషా, తేళ్ల శ్రీనివాస్, జెర్రిపోతుల వెంకన్న, ముత్యం వెంకన్న, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






