27 June, 2026 | 3:32 AM

రూ.7 కోట్లతో పాఠశాల అభివృద్ధి

27-06-2026 02:13 AM

భూమి పూజతో పనులకు శ్రీకారం

ఇనుగుర్తి, జూన్, 26 (విజయక్రాంతి): రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర చొరవతో రూ. 7 కోట్లతో తన స్వగ్రామమైన ఇనుగుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల అభివృద్ధి పనులకు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను భాగస్వామ్యం చేస్తూ 6 కోట్ల రూపాయల సిఎస్‌ఆర్ నిధులను మంజూరు చేయించి, తన ఎంపీ కోట కింద మరో కోటి రూపాయలు కేటాయించి శుక్రవారం పాఠశాల ఆవరణలో పనులకు శ్రీకారం చుట్టారు. ఎంపీ రవిచంద్ర సోద రుడు వద్దిరాజు కిషన్ నేత్రుత్వంలో గ్రామ సర్పంచ్ తమ్మడపల్లి కుమార్,  మాజీ ప్రజా ప్రతినిధులు, అభివృద్ధి కమిటీ సభ్యుల సమక్షంలో భూమి పూజ నిర్వహించారు.