27 July, 2026 | 7:53 PM

Breaking News

తరుగు పేరుతో రూ.71 లక్షల అవినీతి   •   మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు   •   దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •   రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో లబ్ధి పొందాలి   •   ఆర్థిక సాయం అందించిన టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ యూనియన్   •  

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ను కలిసిన యూహెచ్ఆర్ఎల్ఎఎ ప్రతినిధులు

03-06-2026 07:19 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): యూహెచ్ఆర్ఎల్ఎఎ(UHRLAA Representatives Meet Women's Commission Chairperson)  ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహిళల హక్కులు, చట్టపరమైన అవగాహన, మహిళా సాధికారత, భద్రత, సంక్షేమానికి సంబంధించిన పలు ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చించారు. మహిళలకు చట్టపరమైన అవగాహన కల్పించడం అత్యంత అవసరమని ప్రతినిధులు పేర్కొన్నారు.

మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, వేధింపులను అరికట్టేందుకు అవగాహన కార్యక్రమాలను విస్తృత స్థాయిలో నిర్వహించాల్సిన అవసరాన్ని వివరించారు. అలాగే మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వ సంస్థలు మరియు స్వచ్ఛంద సంస్థలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈ  సందర్భంగా గద్వాల విజయలక్ష్మి యు హెచ్ ఆర్ ఎల్ ఏ ఏ సంస్థ చేపడుతున్న మానవ హక్కులు, మహిళా హక్కులు, చట్టపరమైన అవగాహన కార్యక్రమాలను అభినందించారు.

మహిళల సాధికారిక కోసం సంస్థ మరింత సేవా చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో  యూ ఎచ్ ఆర్ ఎల్ ఎ ఎ, చైర్మన్  డి. కమలాకర్, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  మెరాజ్ ఫాతిమా, మేడ్చల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు  బత్తిని మీనా, మేడిపల్లి మహిళా అధ్యక్షురాలు ఎ. మాలతి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు  జి. లలిత, లీగల్ సెల్ అడ్వైజర్  కె. నాగజ్యోతి, మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్  కే.కే. చారి, జనరల్ సెక్రటరీ వి. నవీన్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ కదం తదితరులు పాల్గొన్నారు.