20 March, 2026 | 2:17 PM

వచ్చింది ఉగాది!

19-03-2026 12:00 AM

ఆకులు రాలిన చోట చిగురింత 

వయ్యారి కోకిల గానం పులకింత 

షడ్రుచుల పచ్చడి కమ్మదనం 

శ్రావ్యమైన పంచాంగ శ్రవణం 

ఆ శుభ ముహూర్తమే ఉగాది 

శాంతి సౌఖ్యాలకు పునాది! 

యుగ యుగాలకు ఆది

మన తెలుగు సంవత్సరాది 

వసంత ఋతువు ఆగమనంతో 

అరుణోదయ తొలి కిరణాలతో 

కొత్త ఉషస్సు పంచడానికి 

హరిత వర్ణ శోభితమై 

కొత్త ఆశలతో 

కొత్త కోరికలతో 

వచ్చింది ఉగాది

తెచ్చింది నవ క్రాంతి!