16 July, 2026 | 10:39 AM

నాణ్యమైన విద్యుత్ సరఫరా కు పటిష్ట చర్యలు

16-07-2026 10:25 AM

- ఇన్సులేటెడ్ కవర్డ్ కండక్టర్స్ ఏర్పాటు

టి జి ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మహేందర్ 

అశ్వారావుపేట:(విజయక్రాంతి): ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా  చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్టు టిజిఎన్పిడిసిఎల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్ఈ మహేందర్ తెలిపారు. ఇన్సులేటెడ్ కవర్డ్ కండక్టర్ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ విద్యుత్ వినియోగ సామర్థ్యం పెంపుకు అనుగుణంగా సబ్ స్టేషన్ లు నిర్మాణం  చేపట్టినట్టు తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా 73 సబ్ స్టేషన్ లు ఉన్నాయి అని తెలిపారు.ఏడాదిన్నర కాలంలో మరో 23 సబ్ స్టేషన్ లు మంజూరు  చేసినట్టు చెప్పారు.

నాలుగు సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి  అయ్యాయి అన్నారు.

10 సబ్ స్టేషన్ లు వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయి  తెలిపారు.

9 సబ్ స్టేషన్ లు టెండర్లు ప్రక్రియ లో ఉన్నట్లు తెలిపారు.

56 ట్రాన్స్ఫార్మర్ లు సామర్ధ్యాన్ని పెంచినట్టు చెప్పారు. గడిచిన 2 సంవత్సరాల లో 14 వేల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు  చేయటం జరిగింది అన్నారు.

దట్టమైన అటవీ ప్రాంతంలో,పామాయిల్,జామాయిల్, సుబాబుల్ సాగు చేసే వ్యవసాయ క్షేత్రాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా మొదటి ఫేజ్ లో 33 కేవీ సబ్ స్టేషన్ లు పరిధిలోని 39 ఫీడర్ ల్లో 60 కిలోమీటర్ల దూరం ఇన్సులేటెడ్ కవర్డ్ కండక్టర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

2 ఫీడర్ లు పరిధిలో పనులు పూర్తి అయ్యాయి అన్నారు.

విద్యుత్ సిబ్బంది కొరత ను అధిగమించి అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేయడానికి 6 గురు సభ్యులు తో కూడిన 9 ఈఆర్టీ బృందాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆయన వెంట డీఈ నందయ్య,ఏడీఈ వెంకటరత్నం,ఏఈ వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.