30 June, 2026 | 9:49 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

సీజ్ ఫైర్ బ్రేక్ — పశ్చిమాసియాలో తొలగని యుద్ధమేఘాలు

08-04-2026 04:51 PM

సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిన గంటలకే మళ్లీ దాడులు

ఇరాన్-అమెరికా కాల్పుల విరమణ

టెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా యుద్ధమేగాలు తొలగలేదని యూఏఈ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే యూఏఈపై క్షిపణి దాడి జరిగింది. ఇరాన్ తమపై క్షిపణి దాడి చేసిందని యూఏఈ(UAE) ప్రకటించింది. ఇరాన్ క్షిపణులను తమ రక్షణ వ్యవస్థ అడ్డుకుందని వెల్లడించింది. లెబనాన్ లోని హెజ్ బోల్లాపై దాడులు కొనసాగుతున్నాయని ఇజ్రాయెల్ తెలిపింది. లెబనాన్ పై దాడులు ఆపకపోతే టెల్ అవీవ్ పై దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. తమ లవన్ ద్వీపంలోని ఆయిల్ రిఫైనరీపై దాడి జరిగినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ డ్రోన్లు తమ చమురు, విద్యుత్ కేంద్రాలపై దాడి చేశాయని, ఇరాన్ డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని కువైట్ వెల్లడించింది.