జీవితంపై విరక్తి చెంది ఇద్దరు యువకుల ఇద్దరు ఆత్మహత్య
దమ్మపేట,(విజయ క్రాంతి): మండల పరిధిలోని, తాటిమల్లప్పగుంపు గ్రామానికి చెందిన వాడే రాము (30) మద్యానికి బానిసై, వివాహం కూడా జరగకపోవడంతో జీవితం పై విరక్తి చెంది ఈ నెల 3 వ తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో మద్యంలో గుర్తు తెలియని విషం కలుపుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా వైద్యం నిమిత్తం ఖమ్మం తరలించి వైద్యం చేస్తుండగా గురువారం రాత్రి మరణించాడని మృతుని తండ్రి వాడే రాజులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ సాయి కిషోర్ రెడ్డి తెలిపారు.
మండల పరిధిలోని లచ్చాపురం గ్రామానికి చెందిన అల్లం సాయి ప్రసాద్ మద్యానికి బానిసై కూలీ పనులు చేయలేకపోవడంతో, తన జీవితంపై విరక్తి చెంది గురువారం మధ్యాహ్నం 12.00 గంటల సమయంలో గుర్తుతెలియని విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి 1.30 కు మరణించాడని మృతుని సోదరి గంపా వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ సాయి కిషోర్ రెడ్డి తెలిపారు.




