3 April, 2026 | 3:08 AM

రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

03-04-2026 01:25 AM

బూర్గంపాడు, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను బూర్గంపాడు పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బుడ్డగూడెం సమీపంలోని కిన్నెరసాని వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక లోడ్ చేసుకుని వస్తున్న రెండు ట్రాక్టర్లను మోరంపల్లిబంజర్ గ్రామ సమీపంలో పట్టుకున్నట్లు తెలిపారు. ట్రాక్టర్లను తహశీల్దార్కు అప్పగించినట్లు వెల్లడించారు.