12 May, 2026 | 10:57 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

మండలంలో రెండు పంచాయతీలు ఏకగ్రీవం

04-12-2025 12:00 AM
  1. మద్దికొండలో కాంగ్రెస్. రామన్నగూడెంలో ఏవీఎస్సీ

సర్పంచ్ లుగా తాటి రామకృష్ణ మడకం నాగేశ్వరావు

అశ్వారావుపేట , డిసెంబరు 3 (విజయ క్రాంతి) : అశ్వారావుపేట మండలంలో రెండు పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మండలంలో రెండో విడత స్థానిక పోరుకు సంబందించి మంగళవారం రాత్రిలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తికాగా, బుధవారం నామినేషన్ల పరిశీలన చేశారు. నామినేషన్ల పరిశీలన అనంతరం మద్దికొండ రామన్నగూడెం పంచాయతీలు ఏకగ్రీవం అయ్యియి. రెండు పంచాయతీల్లో ఒకటి కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టగా మరొకటి ఏవిఎస్ పి ఖాతాలోకి వెళ్లింది. మద్దికొండ పంచాయతీని ఏకగ్రీవం చేసేందుకు అందరూ ఏకతాటిపైకి వచ్చారు.

అదికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్. గ్రామపెద్దలు ఇతర రాజకీయ పార్టీలు నాయకులు చర్పించుకుని ఏకగ్రీవం వైపు మొగ్గు చూపారు. దీంతో కాంగ్రెస్ మద్దతు తెలిపిన తాటి రామకృష్ణను సర్పంచి అభ్యర్థిగా ఏకగ్రీవంగా నిర్ణయించారు. మరో ఎనిమిది వార్డులను కూడా ఏకగ్రీవం చేసి బీఆర్‌ఎస్ మద్దతు తెలిపిన నేర్పు శ్రీను ఉపసర్పంచిగా ఎన్నుకోవాలని నిర్ణయించారు. దీంతో ఆయా సర్పంచ్ అభ్యర్థితో పాటు ఎనిమిది వార్డులకు నామినేషన్లు దాఖులు చేశారు. మరొకరు నామినేషన్ దాఖ లు చేయకపోవటంతో ఏకగ్రీవం అయింది.

ఇక రామన్నగూడెంలో పార్టీలకు అతీతంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరపున మడ కం నాగేశ్వరావు సర్పంచి అభ్యర్థిగా మరో ఆరు వార్డులకు ఆరుగురు నామినే షన్లు చేశారు. నామినేషన్ల పరిశీలన అనంతరు పంచాయతీ ఏకగ్రీవం అయింది. సర్పంచిగా మడకం నాగేశ్వరరావు, ఉప సర్పంచిగా కొరా కళ్యాణిని పరిపాలన చేయనున్నారు. రెండు పంచాయతీలు ఏకగ్రీవం కా వటంతో పంచాయతీకి వచ్చే నిధులతో ప్రత్యేకంగా పది లక్షలు పారితోషకం అందు నుండటంతో పంచాయతీలో అభివృద్ధి పనులు చేపడతామని ఏకగ్రీవ సర్పంచులు రామకృష్ణ, నాగేశ్వరరావు తెలిపారు.